Alla Nani: టీడీపీలోకి చేరేందుకు సిద్ధమయ్యారు..! 19 d ago
సీఎం చంద్రబాబు సమక్షంలో వైసీపీ నేత, ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని టీడీపీలోకి చేరేందుకు సిద్ధమయ్యారు. మంగళవారం కేబినెట్ భేటీ అనంతరం చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల అనంతరం ఆళ్ల నాని వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే, విజయనగరం జిల్లాకు చెందిన ఓ నేత టీడీపీ పెద్దలు, నానితో మంతనాలు జరిపి చేరికకు ఒప్పించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.